నందిపేట్, తెలంగాణ వార్త :మంగళవారం పలు గ్రామాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107 జయంతి వేడుకలు.
తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107 జయంతి ని మంగళవారం నందిపేట్ మండల కేంద్రం , వెన్నెల కె తదితర గ్రామాలలోని పద్మశాలి నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా పద్మశాలి సంఘం నందిపేట్ గ్రామ అధ్యక్షుడు మాజీ ఎం పి టి సి బాల గంగాధర్ మాట్లాడుతూ 1915 సెప్టెంబర్ 27వ తేదీన అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించిన కొండ లక్ష్మణ్ ,మహాత్మా గాంధీతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహా యోధుడు అని కితాబు చేశారు.. అసిఫాబాద్ నుంచి 1952లో తొలిసారి ఎంఎల్ఎగా గెలిచి, 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగాడని అన్నారు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని ఆయన త్యాగాలను కొనియాడారు. నిఖార్సయిన తెలంగాణ వాది. 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న ఆయన రాష్ట్ర చేనేత సమకార రంగానికి కూడా కృషిచేశాడన్నారు, ఆయన బాటలో కె సి ఆర్ ప్రభుత్వం పని చేస్తూ చేనేత రంగానికి అభివృద్ధి చేస్తుందన్నారు. చేనేత కార్మికుల కు పని కల్పించే ఉద్దేశం తో బతుకమ్మ చిరాలు తయారు చేయిస్తున్న ముఖ్య మంత్రి కే సి ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు
వన్నెల్ కె లో
వన్నెల్ కె పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలు నిర్వహించరు .ఇట్టి వేడుకలలో పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ సామల గంగా సాగర్ , కార్యవర్గ సభ్యులు సంబారు లింబగిరి, జిందం అశోక్,బోసి పండరీ, జిందం నారాయణ,చిల్వేరి అశోక్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Leave a comment