-రూ.600 పెన్షన్లు ఇచ్చే గుజరాత్ మోడల్ కావాలా?
-రూ.2016 పెన్షన్లు ఇచ్చే తెలంగాణ మోడల్ కావాలా?
-ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకం
-రైతుబంధువు కేసీఆర్
-కేసీఆర్ దమ్మున్న సీఎం
-మన పథకాలను దేశమే మెచ్చుకుంటున్నది
-బీజేపీ, కాంగ్రెస్ లు కళ్ళుండి చూడలేని కబోదులు
-కేసీఆర్ పాలనను చూసి ఓర్చుకోలేక పోతున్నారు
-నవ భారత నిర్మాణానికి కేసీఆర్ బాటలు
-బీజేపీ కోటలకు బీటలు
-టీఆర్ ఎస్ పేదోళ్ల పార్టీ
-మళ్లీ మళ్లీ కేసీఆర్ ను గెలిపించు కోవాలన్నది జనాభిప్రాయం
-దేశానికి కేసీఆర్ నాయకత్వం చారిత్రిక అవసరం
-చీరెలా పంపిణీ దేశంలో ఎక్కడైనా ఉన్నదా?
-అరగుండు అరవింద్ బ్రోకర్, జోకర్
-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-ఆర్మూర్ లో బతుకమ్మ చీరెలు, ఆసరా కార్డులు, సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, సెప్టెంబర్27:-
పేదోళ్ల కడుపులు కొడుతూ పెద్దోళ్లకు దోచిపెడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణములోని ఎస్ ఎస్ కే సమాజ్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో ఆయనమహిళలకు బతుకమ్మ చీరెలను, ఆసరా లబ్ధిదారులకు కార్డులను, కల్యాణ లక్ష్మీ షాది ముభారక్ లబ్ధిదారులకు చెక్కులను, అనారోగ్యంతో బాధపడుతున్న దాదాపు 250 మంది కిసీఎం సహాయనిది క్రింద మంజూరు చేయించిన చెక్కులను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా పెద్ద ఎత్తున జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ దార్శనికత ఉన్న నాయకుడి గా ప్రజాభిమానం పొందిన కేసీఆర్ పంతమే బీజేపీ అంతమని వ్యాఖ్యానించారు.
దేశానికి పట్టిన దరిద్రం వదలాలంటే కేసీఆర్ రావాలె. మోడీ పోవాలె.నవ భారత నిర్మాణానికి కేసీఆర్ బాటలు వేస్తుంటే బీజేపీ కోటలు బీటలు వారుతున్నాయి.
మళ్లీ మళ్లీ కేసీఆర్ ను గెలిపించు కోవాలన్నది జనాభిప్రాయం.దేశానికి కేసీఆర్ నాయకత్వం చారిత్రిక అవసరం. కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ ఊరూ వాడ నినదిస్తున్నాయి.
ఊరూరు సారు,కారు,కేసీఆర్ అన్నది తెలంగాణలోనే కాదు దేశంలోనే మారుమోగుతున్న నినాదం అని జీవన్ రెడ్డి అన్నారు.
రూ.600 చొప్పున పెన్షన్లు ఇచ్చే గుజరాత్ మోడల్ కావాలా? రూ.2016, రూ 3016 చొప్పున పెన్షన్లు ఇచ్చే తెలంగాణ మోడల్ కావాలా?. కొంత మంది సన్నాసులు తెలంగాణ వస్తే ఏమొస్తదన్నారు.
ప్రతీ ఇంటికీ అందుతున్న సంక్షేమ పథకాలు, దేశాన్నే అబ్బురపరిచే అభివృద్దే వారికి సమాధానం. ప్రతీ రోజు అన్నం పెట్టే రైతుల కష్టాలు తీర్చాలని రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న
రైతు బాంధవుడు కేసీఆర్. రైతుల ఉసురు పోసుకుంటున్న మోడీ రైతుల పాలిట రాబంధువు. కేసీఆర్ వంటి దమ్మున్న సీఎం దేశంలోనే లేరు.
తెలంగాణ పథకాలను దేశమే మెచ్చుకుంటున్నది. బతుకమ్మ పండుగ చీరెల పంపిణీ కార్యక్రమం దేశంలో ఎక్కడైనా ఉందా? అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా 56వేల మంది మంది ఆసరా లబ్ధిదారులకు ప్రతీ నెలా 2కోట్ల 51లక్షల72 వేల 112 రూపాయలు తేవాలంటే పది లారీలు , వంద ట్రాక్టర్ లు కావాలి. ఇంటి పెద్ద కొడుకుగా కేసీఆర్ పెన్షన్లు ఇస్తుండు. ఆసరా పథకం పుణ్యమా అని ఇప్పుడు అత్త కోడళ్ల పంచాయితీ లేదు. ఒకప్పుడు అత్త కొట్టంలో, కోడలు ఇంట్లో ఎడముఖం, పెడ ముఖంగా ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. హైదరాబాద్ నుంచి మనవళ్లు తాతల చుట్టూ తిరుగుతుండ్రు. కోడళ్లు అత్తల మధ్య గొడవలు లేవు పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు కళ్యాణ లక్ష్మీ పథకం కింద ఒక లక్షా 116 చొప్పున ఇస్తూ జరిపిస్తున్నారు.కేసీఆర్ దయతో ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి వచ్చిందని, 20వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. కేసిఆర్ కిట్ గొప్ప కార్యక్రమన్నారు.తల్లికి చీరె, పుట్టిన బిడ్డకు బట్టలు,పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆరోగ్య సామాగ్రి, ఆట వస్తువులు, దోమల తెర వంటి వాటితో శిశు రక్షణకు ఇస్తున్నదే కేసీఆర్ కిట్ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 6 నెలల గర్భవతి నుంచి 3 నెలల బాలింత వరకు ఆమెకు ఆర్దికంగా అండగా ఉండేందుకు 12 వేల రూపాయలు ఇస్తూ, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలతో పాటు ఇస్తున్న ప్రభుత్వ మిదన్నారు. .బిడ్డ పుట్టిన క్షణం నుంచి పెరిగి పెద్దయి నూరేళ్ళ బంగారు జీవితం గడిపి చనిపోయి వైకుంఠ దామం చేరే వరకు ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ ఎస్ అన్నారు. బీజేపీ మాత్రం పసిపిల్లలు తాగే పాలనుంచి పాడే స్మశానానికి చేరే వరకు జీఎస్ టీ పన్ను వసూలు చేస్తూ దేశ ప్రజల ఊసురుపోసుకుంటున్నదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ లు కళ్ళుండి చూడలేని కబోదులు. కేసీఆర్ పాలనను చూసి ఓర్చుకోలేక పోతున్నారు. అభివృద్ధి పై చర్చకు సిద్ధమా?
ఆలూరు, డొంకేశ్వర్ లను మండలాలు చేసిందెవరు?. ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ గా చేసింది నేను కాదా?. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా ను సుందరీకరించింది నేను కదా?. సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్డు వేసింది నేను, కేసీఆర్ కాదా?. ఆర్మూర్-నిజామాబాద్, ఆర్మూర్-ఆలూరు- ఇలా దాదాపు 9బైపాస్ రోడ్లు వేయించా. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల తో మంచినీళ్లు ఇస్తున్నాం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శించే అర్హత అరవింద్ కు లేదన్నారు. తన తండ్రి పీసీసీ అధ్యక్షుడు గా ఉన్నప్పుడు బీపారాలు అమ్ముకున్న బ్రోకర్ అరవింద్. చదువుకునే వయస్సులో బార్ షాపుల చుట్టూ తిరిగిన సైకో అని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత,జడ్పీటీసీలు సంతోష్,ఎర్రం యమున ముత్యం, ఎంపీపీలు పస్క నర్సయ్య,వాకిడి సంతోష్, మస్త ప్రభాకర్ మరియు నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Leave a comment