యస్సిల వర్గీకరణ జరుగుతనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతది
దాసు సురేష్ జాతీయ బిసి సంక్షేమ సంఘము నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్
వరంగల్ ,తెలంగాణ వార్త ::వరంగల్ తూర్పు మహా నగర పాలక సంస్థ ప్రాంగణం ముందు యంయస్పి వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ ఆధ్వర్యంలో 15వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగింది ఈ దీక్షలకు సంగిభావం తెలిపిన జాతీయ బిసి సంక్షేమ సంఘము నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ మాట్లాడుతూ 28వ సంవత్సరాలు నుండి యస్సిల వర్గీకరణ కోసం పెద్దలు మంద కృష్ణ మాదిగ అలుపెరుగక పోరాటం చేస్తున్నారు ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీ లు,వామపక్ష పార్టీలు,అన్ని కుల సంఘాల మద్దత్తు వున్నా ఎస్సిల వర్గీకరణ విషయంలో నిర్లక్ష్యం జరుగుతుంది ఈ పోరాటానికి జాతీయ బిసి సంఘము పూర్తి మద్దత్తు ఉంటదని అన్నారు.
బీజేపీ అధికారం వచ్చిన తరువాత వంద రోజులు వర్గీకరణ చేస్తామని హామీ విచ్చి ఇప్పుడు మౌనం ఉంటుంది తెలంగాణ బీజేపీ పెద్దలు పార్లమెంట్ లో బిల్లు పెట్టేవిధంగా చోరువా చూపాలి బీజేపీ మూల సిద్ధంతమైన పండిత్ దీనియల్ గారి అంతొదయ పథకం అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతని ఆయన అంటే ఈ ఆశయాన్ని బీజేపీ తూట్లు పుడుస్తున్నదని ఇప్పుడు మౌనం విడి ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉండి యస్సిల వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో తక్షణమే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వంన్ని డిమాండ్ చేసారు..ఈ దీక్షలో గంగారపు మల్లన్న మాదిగ,కొండ్రా రాజు మాదిగ, కవ్వం పెళ్లి రవి మాదిగ, పిడికల సంపత్ మాదిగ,గజ్జి రాజు మాదిగ, జన్ను ఆనంద్ మాదిగ, మంద సంజీవ్ మాదిగ,కుమ్మరి రాధా మాదిగ పాలుగోన్నారు జాతీయ బిసి సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షులు బట్టి శ్యామ్ యాదవ్, రంజిత్ గౌడ్ సంగిభావం తెలిపినారు.
Leave a comment