-హత్యాయత్నం ఘటన పై ఆరా
-మనో నిబ్బరం కోల్పోవద్దని సూచన
ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆగస్ట్10:- ఇటీవల హత్యా ప్రయత్నానానికి గురైన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించారు. జీవన్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జీవన్ రెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడి హత్యాయత్నం ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన నేపధ్యంలో మనో నిబ్బరం కోల్పోవద్దని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తనను పరామర్శించి ధైర్యం చెప్పిన కేసీఆర్ కు జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Leave a comment