ఘనంగా ఆటపాటలతోటి గణేష్ ని వీడ్కోలు పలికిన యువకులు
తెలంగాణ వార్త ,ఆర్మూర్:09 పట్టణంలోని, పెర్కిట్ కొటార్మూర్ అన్నపూర్ణ కాలనీలో పూసల సంఘం వద్ద 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో మహిళలు గణేశునికి పూజలు నిర్వహించి ఈరోజు గణేష్ శోభయాత్రకు బయలుదేరుతున్న గణేశునికి మహిళలు కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరిని సంతోషంగా ఉంచాలని, భక్తులు గణనాథుని వేడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పెర్కిట్ పూసల సంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ మాట్లాడుతూ…. కుల సంఘ సభ్యులు ఆధ్వర్యంలో మరియు యూత్ సభ్యులు మహిళలు కలిసికట్టుగా వారి సహకారంతో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని మా సంఘం సభ్యుల యొక్క ప్రోత్సాహంతో మరింత పండుగలను ఉత్సాహంగా చేయడానికి నేను ముందుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మద్దిలేని చిన్నయ్య, పొదిల వెంకన్న, సంఘ ఉపాధ్యక్షులు చేని శ్రీనివాస్, రాజు, రవికుమార్, అర్జున్, సాయికుమార్, కన్నయ్య, సుంకరి గంగా మోహన్, పొదిల కిషన్ గంగాధర్, చేరి సుదర్శన్, నరేందర్ మొదలగు వారు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Leave a comment