Home హాట్ న్యూస్ ప్రజల ఆరోగ్యానికి భరోసా నాది :పి యు సి చైర్మన్ జీవన్ రెడ్డి.
హాట్ న్యూస్

ప్రజల ఆరోగ్యానికి భరోసా నాది :పి యు సి చైర్మన్ జీవన్ రెడ్డి.

ఆర్మూర్ ప్రజల ఆరోగ్యానికి నా భరోసా

-అనారోగ్య బాధితులకు అండగా ఉంటా

-ఆరోగ్య సమస్యలున్న వారు నా వద్దకు రండి

-పెద్దాసుపత్రుల్లో వైద్యం చేయిస్తా

-ఆరోగ్యశ్రీ, సీఎం ఆర్ ఎఫ్ లను ప్రజలు ఉపయోగించుకోవాలి

-రైతుబీమా అద్భుత పథకం

-రైతన్నలంతా ఈ స్కీములలో చేరాలి

-ఆగస్టు1నుంచి15 వరకు రైతుబీమా రెన్యూవల్

-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-పలువురికి ఎల్ వో సీ చెక్కుల పంపిణీ

తెలంగాణ వార్త:హైదరాబాద్, మార్చి 30:-
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యానికి తనదే భరోసా అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాక్లూర్ మండలం కల్లెడకు చెందిన ఎం.సుధాకర్, మాక్లూర్ మండలం రామచంద్రపల్లికి చెందిన నెహ్రూ ఒక లక్ష 25వేల రూపాయల చొప్పున, ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన జే.మేఘనకు లక్ష రూపాయల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్ వో సీ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అండగా ఉంటానన్నారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తన వద్దకు వస్తే పెద్దాసుపత్రుల్లో చేర్పించి ఆరోగ్యశ్రీ, ఎల్ వో సీ , సీఎం అర్ ఎఫ్ ల ద్వారా వైద్యం చేయిస్తామని, ఈ స్కీములు వర్తించని వారికి పెద్దాసుపత్రుల్లో డిస్కౌంట్ ఇప్పించే బాధ్యతను కూడా తానే తీసుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, ఎల్ వో సీ, సీఎం ఆర్ ఎఫ్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో కొంతమంది సొంత ఖర్చులతో పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం పొందినవారున్నారు. అయిదు లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు వారు సంబంధిత బిల్లులను ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేస్తే సీఎంతో మాట్లాడి ఆ బిల్లులను మంజూరు చేయిస్తా. అలాగే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న వారు కూడా తమ వివరాలను నా ఫోన్ నంబర్-99496-99999కు కాల్ చేసి చెప్పండి. నేను అందుబాటులో లేకుంటే నా పీఏ లు సుమంత్ నంబర్-9502317803, రాజేష్ నంబర్-98666 01096, శ్రీకాంత్ నంబర్-9010771277 లకు ఫోన్ చేసి వివరాలను తెలిపితే వెంటనే వారిని నిమ్స్ తో పాటు ప్రెయివేట్ కార్పొరేట్ దవాఖానల్లో చేర్పించి ప్రభుత్వ ఖర్చులతో వైద్య చికిత్సలు చేయిస్తాం” అని ఆయన పేర్కొన్నారు. టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారు కూడా తమ వివరాలను నిజామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఇవ్వాలని జీవన్ రెడ్డి సూచించారు.

రైతుబీమా అద్భుత పథకం

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ ఆర్మూర్ వరకూ రైతుబీమాను మించిన పథకం మరొకటి లేదని జీవన్ రెడ్డి అన్నారు.
ఏవైనా అనుకోని కారణాల వల్ల ఎవరైనా రైతులు చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా, వారి పిల్లల చదువులు మధ్యలోనే ఆగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ధీమా రైతుబీమా అని ఆయన పేర్కొన్నారు. కీడెంచి మేలోంచాలన్న స్థితిలో రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు ఉపయోగపడుతుందన్నారు.. “రైతుబీమాకు సీఎం కేసీఆర్ రూ.3500 కోట్లు కేటాయించారు. ఇంకా చాలామంది రైతులు ఈ బీమా పథకం పరిధిలోకి రాలేదు. ఇప్పటికైన రైతులంతా ఆగస్టు ఒకటో తేదీ నుంచి15వ తేదీ వరకు రెన్యువల్ చేయించుకొని రైతుబీమా పథకంలో చేరాలి” అని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page