Home హాట్ న్యూస్ ప్రధాని మోడీ తో కేసీఆర్ లోల్లి.
హాట్ న్యూస్

ప్రధాని మోడీ తో కేసీఆర్ లోల్లి.

హైదరాబాద్, తెలంగాణ వార్త: ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సుమారు ఆరు గంటలపాటు జరిగింది. వివిధ అంశాలపై చర్చించారు. బీజేపీతో ఇక యుద్ధమేనని, అమీతుమీ తేల్చుకుందామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎంపీలకు చెప్పినట్లు తెలిసింది. టీఆర్ఎస్ ఎంపీల ధర్నాలతో పార్లమెంటుతో పాటు దేశం మొత్తం దద్దరిల్లాలని, పట్టుపడితే తానేమి చేస్తానో, తన బలమేమిటో ప్రధాని మోదీకి తెలుసని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం తీవ్ర ఒత్తిడి తేవాలని ఎంపీలకు సీఎం చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడున్నరేళ్లుగా తెలంగాణకు చేసిందేమీ లేదని, రాష్ట్రంపై కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని, విభజన హామీలను పూర్తిగా విస్మరించిందని కేసీఆర్‌ విమర్శించారు.

కీలక అంశాల్లో కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ సమావేశాల తొలిరోజే సంచలన చర్యకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి బడ్జెట్ భేటీ ప్రారంభం కానుండగా, రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని గులాబీ బాస్ నిర్ణయించారు. ఈ సెషల్ లో టీఆర్ఎస్ సత్తా చూపాలని, ఏ అంశంలోనూ వెనక్కి తగ్గొద్దని తెలంగాణ హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా.. బయటా గట్టిగా పోరాడాలని, బలమైన వాణి వినిపించాలని పార్టీ తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని, కేంద్రాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమని, గత ఏడున్నర సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్‌ సమయంలో తెలంగాణకు న్యాయం చేయాలని కోరుతున్నా ఏం మాత్రం పట్టింపు లేదని, పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదని, షెడ్యూల్‌ 9,10లోని ప్రభుత్వ సంస్థల విభజన ఇంకా అసంపూర్తిగానే ఉందని పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని తెలిసింది.
తెలంగాణలో శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియ కాగితాలకే పరిమితమైందని, విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా కేంద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లలో ఒక ఏడాది బకాయిలు ఇంకా ఇవ్వలేదని, హైదరాబాద్‌లో ప్రతిపాదించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌.ఐ.డి.)ను రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారని, రాష్ట్రానికి ఒక్క వైద్యకళాశాల కూడా మంజూరు చేయలేదని, రాష్ట్రంలోని గిరిజనులు, ముస్లింల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ ఎస్సీ వర్గీకరణ కోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా స్పందన లేదని, ధాన్యం సేకరణకు సంబంధించి యాసంగిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని కేంద్రంపై కేసీఆర్ మండిపడ్డారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల విషయంలోనూ నిబంధనలను సవరించి, రాష్ట్రాల పాలనలో జోక్యానికి పూనుకుందని, దేశాన్ని పాలించేది ఇలాగేనా? బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఉందని,. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అది ప్రస్ఫుటమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాటాలకు ప్రజల నుంచి, వివిధ పార్టీల నుంచి స్పందన లభిస్తోందని, గత పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని గట్టిగా నిలదీశారని, ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనా తెలంగాణకు పెద్దగా ఆశలు లేవని, అయితే బడ్జెట్‌ కేటాయింపుల్లో అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నిద్దామని, పార్లమెంటు సమావేశాల్లో తొలిరోజే బహిష్కరణ ద్వారా మన వైఖరి తెలియజేద్దామని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రపతి ప్రసంగంలో పొగడ్తలు తప్ప ఏమీ ఉండదు. దాంతో ఒరిగేదేమీ లేదు కాబట్టే బహిష్కరిద్దామని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. కాగా, కేసీఆర్ బాటలోనే దేశంలోని వివిధ పార్టీలు సైతం రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించే అవకాశాలున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page