పార్టీ శ్రేణులకు ఆర్ఎల్ఆర్ పిలుపు
ఉప్పల్, తెలంగాణ వార్త:: ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని జులై 21న ఈ డి కార్యాలయం లో విచారణకు హాజరుకావాలని ఆదేశించిన నేపథ్యంలో ఈడి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు నాచారం డివిజన్ ఇంఛార్జి మేడల మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈనెల 21వ తారీకున ఈడి ఆఫీస్ కు సోనియా గాంధీ విచారణకు హాజరుకావాలని ఆదేశించిన నేపథ్యంలో హైదరాబాద్ ఈడి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ ధర్నాకు ఉప్పల్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని రాగిడి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో
నాచారం డివిజన్ ఇంఛార్జి మేడల మల్లికార్జున్ గౌడ్, మల్లాపూర్ డివిజన్ ఇంఛార్జి వంగెటి సంజీవ్ రెడ్డి,
భద్రయ్య , గ్యార కిరణ్ , పుల్లా ప్రశాంత్, రాకేష్, కర్ణాకర్, సాయి రెడ్డి, జంగం అశోక్, బిక్షపతి, ఆశన్న , వాసు, సురేష్, గొల్లూరి ప్రభాకర్, సందీప్ శెట్టి, శ్రీనివాస్ రెడ్డి, మేడల శ్రీనివాస్ గౌడ్ ,సుభాష్, ఇమ్రోజ్ ,యూసుఫ్ ,సోఫీ, దంతూరి సదానందం గౌడ్, శ్రీకాంత్, బుయ్య శేకర్ గౌడ్, నరేందర్, లీలావతి ,భారతమ్మ, మున్ని బేగం, సుగుణ , లక్ష్మి పాల్గొన్నారు.
Leave a comment