- ఆకట్టుకున్న గిరిజనుల నృత్య ప్రదర్శనలు
- హాజరైన ఆర్ఎల్ఆర్
ఉప్పల్, తెలంగాణ వార్త:: ప్రతినిధి:
గిరిజన బంజారా సోదరులు నిర్వహించే సీత్లా పండుగను హబ్సిగూడ డివిజన్ లోని వెలుగుట్టపై ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వేదికగా నిర్వహించిన ఈ పండుగలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గిరిజన సోదరులు నిర్వహించే ఈ పండుగకు సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ టి సెల్ చైర్మన్ గణేష్ నాయక్, లాలయ్య నాయక్, టిపిసిసి ఎస్టీ సెల్ కార్యదర్శి మాలు నాయక్, రాజు నాయక్ రమేష్ నాయక్, కిషన్ నాయక్, శ్రీకాంత్ నాయక్ గాంధీ గిరిజన బస్తీ ప్రజలు పాల్గొని నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. గిరిజనులతో కలిసి రాగిడి లక్ష్మారెడ్డి ఆటపాటల మధ్య లయబద్దంగా స్టెప్పులు వేసి అదరహో అనిపించుకున్నారు. గిరిజనులకు సీత్లా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు గిరిజన మహిళలు తమ నృత్యాలతో రాగిడికి ఘన స్వాగతం పలికారు.
Leave a comment