Home హాట్ న్యూస్ మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ..
హాట్ న్యూస్

మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ..

  • హాజరైన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి
    ఉప్పల్, తెలంగాణ వార్త:: ప్రతినిధి:
    పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్ధులకు మంగళవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి సైతం పాల్గొన్నారు.
    మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పదివేల చెక్కును మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ సమక్షంలో పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యా వాలంటీర్లకు ప్రతి నెల 10 వేల జీతం అందిస్తూ చెక్కులను అందజేశారు.
    ఈ కార్యక్రమంలో ఎంఈఓ , మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ పెద్దలు, ఉపాధ్యాయులు, 25వ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page