ఆర్మూర్( తెలంగాణ వార్త) గురువారం గ్రామ పంచాయతీ లో ఉదయం 9 గంటలకు సర్పంచ్ శ్రీ ఆసపురం దేవి శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన కరోనా మహమ్మారి పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది గ్రామం లోపల ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని మాస్కు పెట్టుకొని వారికి వేయి రూపాయల జరిమానా విధించాలని మరియు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించగలరు శానిటైజర్ వాడాలని గుంపులుగుంపులుగా ప్రజలు ఉండకూడదని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని సర్పంచ్ గారు కోరడం జరిగింది ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకో గలరని మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరియు ఎవరైనా రెండో డోస్ వేసుకొని వారు రెండో డోస్ వేసుకోవాలని మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి కాంత్ గారు మరియు హెల్త్ ఆఫీసర్ సుజాత నాయుడు గారు మరియు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ మరియు Vra s గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొనడం జరిగింది
Leave a comment