తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీకానున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ పర్యటన పలుసార్లు వాయిదా పడింది. కేంద్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు కూడగట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో కూడా చర్చలు జరిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మంత్రులు, అధికారులతో చర్చించి బడ్జెట్ సమావేశాల నిర్వహణా తేదీలను ఖరారు చేస్తారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది.
Leave a comment