Home హాట్ న్యూస్ తెలంగాణలో రెండేళ్ళు మిగిలి ఉండగానే ఎన్నికలు: :ప్రశాంత్ కిషోర్
హాట్ న్యూస్

తెలంగాణలో రెండేళ్ళు మిగిలి ఉండగానే ఎన్నికలు: :ప్రశాంత్ కిషోర్

తెలంగాణ లో వరి సాగు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర సర్కారు విధించిన మొదలు ప్రధాని మోడీ పై కేక యుద్ధాన్ని ప్రకటించారు కెసిఆర్.

బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానన్న గులాబీ బాస్ ఆ దిశగా జాతీయ కూటమి ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా, కేసీఆర్ ఇప్పటి నుంచే జాతీయ కూటమి అంటూ హడావుడి చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే భావనలోనే, పొలిటికల్ హీట్ పెంచడానికే కేసీఆర్ బీజేపీతో పోరును ముమ్మరం చేశారనే వాదన కూడా ఉంది. టీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఎంగేజ్ చేసుకోవడం, పీకే నేరుగా సీఎం కేసీఆర్ ను కలవడంతో ముందస్తు వాదనకు మరింత బలం చేకూరినట్లయింది..

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలుసుకున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లిన ఐప్యాక్‌ అధినేత పీకే కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గోవాలో ఎన్నికలు ముగియడంతో ఐప్యాక్‌ టీమ్‌ తెలంగాణకు వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం పీకే టీమ్‌ పనిచేయనుండటం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే పలు సర్వేలను పీకే టీమ్ నిర్వహించింది. పీకే సర్వే చేస్తోన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గత ప్రెస్ మీట్లలోనూ నిర్ధారించడం తెలిసిందే.

సీఎం కేసీఆర్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీలో నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాలుపంచుకున్నట్లు తెలిసింది. కేసీఆర్ తో పలు అంశాలపై పీకే విస్తృతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. సీఎంతో భేటీ తర్వాతే ప్రకాశ్ రాజ్, పీకేలు గజ్వేల్ లో పర్యటించారు. అటు నుంచి మల్లన్న సాగర్, తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌లను కూడా పీకే చూసొచ్చారు. తిరుగు ప్రయాణంలో కొండపోచమ్మ సాగర్‌ను కూడా పరిశీలించారు. వీరి వెంట నీటిపారుదల విభాగం అధికారులు, రిటైర్డ్‌ ఐఏఎస్ కూడా ఉన్నారు.

రైతుల ఉద్యమం దెబ్బకు సాగు చట్టాలను కేంద్రం రద్దు చేయడం, రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందనే అంచనా, తెలంగాణలో వరి సాగుపైనా కేంద్రం భిన్న వైఖరి, రైతుల బోరు బావుల మోటార్లకు మీటర్లు బిగించే అంశంలో కేంద్రంతో కేసీఆర్ ఢీ, కేంద్రం సహకారం లేకుండానే తెలంగాణలో నిర్మితమైన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఇలా రైతులు, వ్యసాయం చుట్టూ ఉన్న అంశాల ప్రాతిపదికగానే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల వ్యూహం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే..

కేంద్రం సహకారం లేకుండా తెలంగాణ ప్రభుత్వం(అప్పులే కావొచ్చు) సొంతగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని ఉప ప్రాజెక్టులులను ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకోసమే ప్రశాంత్ కిషోర్ వరుసపెట్టి తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించారని తెలుస్తోంది. దానితోపాటు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పీకే నేరుగా ఫీల్డ్‌కు వెళ్లి తెలుసుకున్నట్టు సమాచారం.

ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న మార్చి 10 తర్వాత పీకే టీమ్ పూర్తి స్థాయిలో తెలంగాణలో దిగబోతోంది. తాజాగా కేసీఆర్ తో జరిగిన భేటీలో పీకే టీమ్ ముఖ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన నాలుగు నెలలుగా వరుస ప్రెస్ మీట్లు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోన్న కేసీఆర్ అదే ఊపును ఇంకొంతకాలం కొనసాగించి, ముందస్తు ఎన్నికలకు వెళతారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page