Home హాట్ న్యూస్ మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలుసా.
హాట్ న్యూస్

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలుసా.

హైదరాబాద్, తెలంగాణ వార్త: గృహ అవసరాలకు వినియోగించే ఎల్​పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కేజీల సిలిండర్​ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో.. గ్యాస్‌ బండ రేటు 1100 దాటేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులపై మరింత భారం పడనుంది.

దీంతో హైదరాబాద్‌లో గ్యాస్‌ బండ ధర ₹1055 నుంచి ₹1105కు చేరింది. డిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు ₹183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్‌ ధర మాత్రం పెంచడం గమనార్హం. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధర నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా నెలలో 5 రోజులు గడిచిన తర్వాత గృహావసరాల గ్యాస్‌ సిలిండర్ ధరను పెంచడం చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page