నందిపేట్( తెలంగాణ వార్త) నందిపేటలోని రాంనగర్ కాలనీ లో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ఘనంగా నిర్వహించారు ప్రజల స్వచ్ఛంద విరాళాల తో దాదాపు కోటి రూపాయల తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ కార్యక్రమంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి తో పాటు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంజు రాములు మహారాజ్ పాల్గొనగా వీరికి మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వారు ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శిలా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భక్తులకు భారతి స్వామి ప్రవచనాలు చేశారు ప్రతి ఒక్కరూ చేసే పనిలో ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంతో కర్తదిక్షతో పనిచేస్తే విజయం సాదించవచ్చని చెప్పారు ప్రతి ఒక్కరూ హిందు సంసృతి సాంప్రదాయాలను కాపాడాలని సూచించారు.
Leave a comment