నందిపేట్, తెలంగాణ వార్త::
నందిపేట్ మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తున్నారని స్కూల్ ప్రిన్సిపాల్ ఫిరోజ్ హైదర్ వెల్లడించారు .శనివారం పాటశాల లో జరిగిన పేరెంట్స్ టీచర్ సమావేశం సందర్భంగా ఆయన విద్యార్థుల తల్లిదండ్రుల తో మాట్లాడారు.విద్యార్థులు అందరూ పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చూసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
అంతకు ముందు ప్రతి తరగతి గదిలో ఆయా తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ ల సమావేశం జరిగింది. క్లాస్ టీచర్ లను కలిసిన అనంతరం తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ ను కలిసి తమ పిల్లల విద్య ప్రగతిని తెలుసుకొన్నారు.
కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నాగేందర్ , సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Leave a comment