Home హాట్ న్యూస్ ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితుల పేర్లను తొలగించవద్దని బుగ్గారం ఎస్సై కి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు…
హాట్ న్యూస్

ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితుల పేర్లను తొలగించవద్దని బుగ్గారం ఎస్సై కి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు…

ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లుబుగ్గారం ఎస్సై కి “మానవ హక్కుల కమీషన్” ఆదేశాలు తొలగించవద్దు

పిర్యాదుల పై కూడా చర్యలు తీసుకోండి

బుగ్గారం ఎస్సై కి “మానవ హక్కుల కమీషన్” ఆదేశాలు

బుగ్గారం/ జగిత్యాల జిల్లా: తెలంగాణ వార్త::

జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్ గేటు ముందు 2022 మే 1న జర్నలిస్ట్ పై జరిగిన దాడి కేసులో నిందితుల పేర్లు తొలగించకూడదని, అలాగే చుక్క గంగారెడ్డి చేసిన మరో రెండు పిర్యాదులపై కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని బుగ్గారం ఎస్సై కి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఆదేశాలు జారీచేసింది.

హెచ్ ఆర్ సి చైర్ పర్సన్ జస్టిస్ గుండా చంద్రయ్య జారీ చేసిన ఆర్డర్ ప్రతులు పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి కి శనివారం అందాయి.

2022 మే 1న సాక్షాత్తు బుగ్గారం పోలీస్ స్టేషన్ గేటుముందే సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి పై హత్యాయత్నం దాడి జరిగింది. అప్పటి ఎస్సై సందీప్ బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదే కేసులో ప్రస్తుత ఎస్సై తీగల అశోక్ నిందితులైన ప్రజాప్రతినిధుల పేర్లు, నాయకుల పేర్లు తొలగించి కోర్టును తప్పుద్రోవ పట్టించి, కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ అయిన తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి సెప్టెంబర్ 21న తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ కు పిర్యాదు చేశారు.
అలాగే 2022 జూన్ 28న డివిజనల్ పంచాయతీ అధికారిణి కనకదుర్గ బుగ్గారం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో చేపట్టిన విచారణ సమయంలో బుగ్గారం సర్పంచ్ అనుచరులు, పాలకవర్గం సభ్యులు హంగామా సృష్టించి దాడులు చేసే ప్రయత్నం చేశారని ఎస్సైకి మరో రెండు వేర్వేరు పిర్యాదులు చేశారు. ఈ పిర్యాదు లపై కూడా ఎస్సై తీగల అశోక్ కేసు నమోదు చేయలేదు. జిల్లా ఎస్పీకి కూడా పిర్యాదు చేసినా…. చర్యలు శూన్యం కావడంతో చుక్క గంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ యొక్క చైర్ పర్సన్ అయిన జస్టిస్ గుండా చంద్రయ్య ఈ మేరకు బాధితుడు చుక్క గంగారెడ్డి పిర్యాదును పరిశీలించి పూర్వపరాలు తెలుసుకొని ఎస్సై కి తగు ఆదేశాలతో ఆర్డర్ జారీచేశారు. అట్టి ఆర్డర్ ప్రతులు పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి కి శనివారం అందాయి. 2022 మే 1న బాధితుడి పై జరిగిన హత్యాయత్నం దాడి కేసులో నిందితుల పేర్లు తొలగించకూడదని, బాధితుడు చేసిన మరో రెండు పిర్యాదు లపై కూడా తక్షణమే తప్పనిసరి గా చర్యలు తీసుకోవాలని బుగ్గారం ఎస్సైని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ జస్టిస్ గుండా చంద్రయ్య ఆదేశించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page