నందిపేట్ ,తేలంగాణ వార్త::
కేంద్ర ప్రభుత్వం పేదల పైన విధించిన జీఎస్టీ ని వెంటనే తొలగించాలని నందిపేట్ టి ఆర్ ఎస్ నాయకులు మండల కేంద్రం లో బుధవారం ధర్నా.చేసి బి జె పి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ మాట్లాడుతు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆర్మూర్ ఎమ్మెల్యే PUC చైర్మన్ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ అన్న ఆదేశాల మేరకు నందిపేట మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేదల పైన విధించిన జీఎస్టీ ని వెంటనే తొలగించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
పుట్టిన పసిబిడ్డ , తాగే పాల నుంచి స్కూలుకు వెళ్తే పుస్తకాలు రబ్బరు పెన్సిల్ షార్ప్నర్,దురదృష్ట వాస్తు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిపాలైతే ఆసుపత్రిలో జిఎస్టి,అదృష్టం బాగోలేక ఆసుపత్రిలో మరణిస్తే స్మశానంలో జీఎస్టీ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత దేశంలో అన్ని వస్తువుల పైన అది కడుపేదలు వాడే నిత్యవసరాలలో అత్యవసర వస్తువుల పైన విధించిన జిఎస్టి వెంటనే రద్దు చేయాలని దుయ్యబుట్టారు
. మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి ఆగకపోతే ఈ ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని టిఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరించరు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల జడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం, వైస్ ఎంపీపీ దేవేందర్, సీనియర్ నాయకులు బాలగంగాధర్, హైమద్ ఖాన్ , బుడ్డ శివ,సోషల్ మీడియా ఇన్ఛార్జి చిన్నారెడ్డి, లక్కంపల్లి సాగర్ ,నందిపేట్ పట్టణ అధ్యక్షులు భాస్కర్, మైనార్టీ అధ్యక్షులు పాషా, యూత్ నాయకులు వినయ్, గాండ్ల సంతోష్, వినీత్ ,శేఖర్, విజయ్, రవి, వార్డు మెంబర్లు రఫీ ఖాన్ , గంధం సాయిలు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Leave a comment