- ఆకట్టుకున్న శివసత్తుల విన్యాసాలు
ఉప్పల్, తెలంగాణ వార్త:: ప్రతినిధి:
బోనాల జాతరలో భాగంగా బుధవారం సికింద్రాబాద్ తుకారం గేట్ ప్రాంతంలో బోనాల సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పులు, యువకుల కేరింతలు, నృత్య ప్రదర్శనలతో మహిళలు బోనాలతో ర్యాలీగా వచ్చి పోచమ్మ తల్లికి నైవిద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నందన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల జాతరలో దాసి దయానంద్, బాల్రాజ్ గౌడ్, గుండు రామలింగం, కుక్కల శీను, శ్రీనివాస్ గుప్త, రాజమల్లు, రేణుక, శకుంతల, సుగుణ, సీమ, మీనాక్షి, భారతమ్మ, శివలక్ష్మి, విలియం సరోజ విలియం, సరోజ, పుష్ప మాల నాయుడు, తదితరులు పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
Leave a comment