పడకల్, తెలంగాణ వార్త:
ప్రభుత్వ స్కూల్లో 10వ తరగతి లో ప్రతిభ కనబరచిన వారికి నగదు బహుమతి
జక్రన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో ని జిల్లా పరిషత్ హై స్కూల్లో మరియు నందిపేట్ మండలంలోని వెల్మల్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో గోర్తీశ్వర ట్రస్ట్ ద్వారా హైస్కూల్లో టాప్ జిపి ఏ వచ్చిన వారికి స్వచ్ఛంద సంస్థ ద్వారా నలుగురు పిల్లలకు పదివేల చొప్పున 40000 రూపాయలు పై చదువుల కొరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది పడకల్ హైస్కూల్లో దినేష్ కుమార్ మరియు మాధురి లంబాడి తండాకుచెందిన అమ్మాయి అట్లాగే వెల్మల్లో శ్రీ నిత్య మరియు రక్షిత ఈ యొక్క పిల్లలకు ఈరోజు వారి వారి పాఠశాలలో నగదు బహుమతి చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది దీనికి మా గురువురాలు ఉషాబాల పవన్ కుమార్ గారి ఆర్థిక సహకారంతో గత ఆరు సంవత్సరాల నుంచి ఇట్టి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పడకల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ నర్సింహులు మల్లయ్య ముద శీను నాగేష్ రెడ్డి ఎండి నాజర్ గారు మరియు వారి వారి పాఠశాల నుండి ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది
Leave a comment