Home జనరల్ <em>పెళ్ళిలలో వింత పోకడలు</em>
జనరల్

పెళ్ళిలలో వింత పోకడలు

 1. కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం (పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్ళమని కూడా గుర్తుండదు)
 2. ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని ,చెమట కంపు తో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థ రాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొదున వడ్డించడం…….రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే .
 3. ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. (కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం.)
 4. పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం.

4.పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకొ ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.

 1. Photoస్ natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది.(photographer bill కూడా లక్షల రూపాయలు)
 2. పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధాచేయడం.
 3. భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల desserts(ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు,ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత.(భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)
 4. పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి,photos కి pose ఇవ్వడం(ఆ photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం.
 5. ఇక పెళ్లి జరిపించే పంతుళ్ళు కూడా రక రకాల packages తో, పెళ్లి వేడుకను ఒక వ్యాపార తంతుగా మార్చి , లక్షల రూపాయలు వసూలు చేయడం.
 6. DJ MUSIC అనే పేరుతొ, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో,అర్థం పర్థం లేని సినిమా పాటలు.
 7. కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం(వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).

12.ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని ,పనికిమాలిన events.

13.మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు).

 1. ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు.

15.తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్.
పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం repeat.

 1. ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్.(.ఇది కూడా లక్షల్లో).
 2. ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు.

18.అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం.

*పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతు కి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు.

ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఫంక్షన్ హాల్స్ వాళ్లని, caterers వాళ్లని, photographers ని, decoraters ని,కోటీశ్వరుల్ని చేయడం మాత్రం ఖాయం.

ఈ పోస్ట్ చదివి కొంతమందన్నా మారుతారని ఆశిద్దాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page