కామారెడ్డి (తెలంగాణ వార్త) ఉమ్మడి జిల్లా అయిన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా బాలికల గురుకుల పాఠశాలల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. శిరీష అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి స్కూల్ వాటర్ ట్యాంకు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళ్తే నిజాంసాగర్ మండలం ముగ్దూంపూర్ గ్రామానికి చెందిన శిరీష ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గురుకులపాఠశాల చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఏమైనా జరుగుతుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.
Leave a comment