నందిపేట్, తెలంగాణ వార్త ::తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ముదిరాజ్ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో మా ముదిరాజ్ ముద్దుబిడ్డ అయినటువంటి మేఘమాల ముదిరాజ్ 17 సంవత్సరముల అమ్మాయి ఇంటర్ విద్యార్థి అతి దారుణంగా హత్యకు గురైంది కాబట్టి వెంటనే ఆ దోషులని ఉరితీయాలని ముదిరాజ్ మండల కమిటీ తరఫునుండి డిమాండ్ చేస్తున్నాం, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండల.అధ్యక్షులు టి రాజేశ్వర్ ముదిరాజ్ , రుమ్మ నాగేష్, ముదిరాజ్ వేముల భూమన్న ముదిరాజ్ ,వేముల దేవా ముదిరాజ్, వేముల సాయినాథ్ ముదిరాజ్, వేముల కుమార్ ముదిరాజ్ ,శెట్టిపల్లి శ్రీకాంత్ ముదిరాజ్, బద్గుణ చిన్న భోజన్న ముదిరాజ్ ,తదితరులు పాల్గొన్నారు
Leave a comment