Home హాట్ న్యూస్ చంద్రుడికి తప్పిన ప్రమాదం
హాట్ న్యూస్

చంద్రుడికి తప్పిన ప్రమాదం

కేనవరాల్‌, మార్చి 3: అంతరిక్ష వ్యర్థాల నుంచి చంద్రుడికి తృటిలో ముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగుతున్న ఓ రాకెట్‌ శకలం.. శుక్రవారం చంద్రుడికి అతి సమీపం నుంచి దూసుకెళ్లిందిగంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ఈ శకలం.. పరిశోధకుల టెలిస్కోపులకు కూడా చిక్కలేదు. అది వెళ్లిన వేగానికి చంద్రుడి ఉపరితలంపై కొన్ని వందల కిలోమీటర్ల మేర చంద్ర ధూళి పైకెగసింది. ఈ అలజడితో.. అక్కడ ఏదో జరిగిందని గ్రహించిన శాస్త్రవేత్తలు.. ఆ తర్వాత రాకెట్‌ శకలం దూసుకెళ్లిన విషయాన్ని గుర్తించారు.

దాదాపు 3 టన్నుల వ్యర్థాలు చంద్రుడి చుట్టూ ఓ బలమైన గోడలా పేరుకుని పోయి ఉండగా.. ఈ శకలం దూసుకొచ్చిన వేగానికి ఆ గోడకు 33 అడుగుల నుంచి 66 అడుగుల లోతైన బిలం ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావాన్ని గుర్తించే దిశగా ప్రస్తుతం పరిశోధనలు సాగుతున్నాయి. ఇందుకు కొన్ని వారాల సమయం పట్టవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి దగ్గరగా తిరిగే గ్రహశకలాల దిశ, గతిని నిరంతరం కనిపెట్టి ఉండే టెలిస్కోపుల సునిశిత దృష్టి నుంచి కూడా ఈ రాకెట్‌ తప్పించుకోవడం గమనార్హం. కాగా, అంతరిక్ష పరిశోధనల కోసం దశాబ్దం క్రితం చైనా ప్రయోగించిన రాకెట్‌గా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. 2014లో చంద్రుడిపైకి చైనా అంతరిక్ష నౌకను మోసుకెళ్లిన రాకెట్‌ అని భావిస్తున్నారు. కానీ, చైనా మాత్రం దీన్ని ఖండిస్తోంది. నాడు తాము పంపిన రాకెట్‌.. తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమైందని పేర్కొంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page