ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న పండిత్ వినిత కు ఆర్మూర్ కౌన్సిలర్లు 26 మంది షాక్ ఇస్తున్నారు. టిఆర్ఎస్ లో కౌన్సిలర్లు ముసలం మొదలైందని చెప్పొచ్చు. ఏది ఏమైనాప్పటికీ ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుండి పండిత్ ప్రేమ్ మరియు మరిది పవన్ ఇండ్ల పర్మిషన్ల లోను ఎక్కడ పనైనా ఇల్లు కట్టుకున్న, బిల్లులు లేపిన, ఇతరత్రా ఏ పనులు జరిగిన చైర్మన్ కు చెప్పకుండా ఏ పని జరగడానికి అనుమతి లభించడం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎవరికీ స్వేచ్ఛనివ్వక నియంతల మున్సిపల్ కార్యాలయం నడుస్తుందని ఆయా కౌన్సిలర్లు చెబుతున్నారు. చైర్మన్ కమిషనర్లకు పడకనే కమిషనర్ సెలవు పెట్టినట్టు కూడా తెలిసింది. చైర్మన్ వారి ఆగడాలకు అదుపు చేయడానికి వారిని తప్పించి ఎవరికైనా చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 26 మంది కౌన్సిలర్లు కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా తప్పనిసరిగా మార్పు చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. 26 మంది కౌన్సిలర్లు ఖాందేష్ సంగీత వైపే మగ్గుచూపుతున్నట్టు జీవ రెడ్డికి ఈ విషయమై అందరూ ఏకధాటిగా తెలియపరిచారు. దీనిపై ఎమ్మెల్యే తప్పనిసరిగా ఖాందేష్ సంగీతాని చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు విశ్వాస నియంగా తెలిసింది.
Leave a comment