హైదరాబాద్, తెలంగాణ వార్త: గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో.. గ్యాస్ బండ రేటు 1100 దాటేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులపై మరింత భారం పడనుంది.
దీంతో హైదరాబాద్లో గ్యాస్ బండ ధర ₹1055 నుంచి ₹1105కు చేరింది. డిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు ₹183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్ ధర మాత్రం పెంచడం గమనార్హం. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా నెలలో 5 రోజులు గడిచిన తర్వాత గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం చర్చనీయాంశంగా మారింది.
Leave a comment