ఆర్మూర్, తెలంగాణ వార్త:
ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసిన సందర్భంలో నేడు ఆర్మూర్ ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి వారు విలేకరులతో సమావేశంలో మాట్లాడారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి 34 శాతం ఉన్న ఎస్సీ 57 ఉపాకులాలు గతంలో 2000 -2004 వరకు అమలు జరిగిన వర్గీకరణ వల్ల ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనివల్ల మాల మాదిగలే లబ్ధి పొందుతున్నారని అన్నారు, ఎస్సీ ఉపకులాలు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో రాజకీయ విద్య ఉద్యోగ పరంగా తీవ్ర అన్యాయానికి గురై నారన్నారు, తెలుగు వారైనా ప్రస్తుతం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సామాజిక న్యాయం జరిగే విధంగా ఉప కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించి ‘A’ వర్గంలో పొందుపరచాలని డిమాండ్ చేశారు ఉపకులాల సమస్యలపై త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు, ఇట్టి ఈ కార్యక్రమంలో బైరి వెంకటేశం మోచి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీ ఉపాకులల హక్కుల పోరాట సమితి,నీరగొండ బుచ్చన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు,గోసంగి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,రాసరి నరేష్,చిత్తారి సాయిలు గోసంగి సంఘం జిల్లా కార్యదర్శి,రాచర్ల దశరథు రాష్ట్ర నాయకులు మోచ సంఘం,ఓటరికారి రమేష్ ,హోలియ దాసరి లక్ష్మణ్. తదితరులు పాల్గొన్నారు.
Leave a comment